కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి శివారులో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో వరి గడ్డికి నిప్పు పెట్టారు. దీనివల్ల పక్కనే ఉన్న సురేశ్ గౌడ్ పశువుల కొట్టంలో గడ్డి అంటుకొని రెండు ఆవులు, రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు, బాటసారులు కలిసి మూగజీవాలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో పశువుల పాక పూర్తిగా కాలిపోయింది.