ఎల్లారెడ్డి మండల మాజీ ప్రధాన కార్యదర్శి నరేష్ ఆదివారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిన్నరాజులకు పంపినట్లు తెలిపారు. 2016 నుండి బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు ఇచ్చిన అవకాశాలకు ధన్యవాదాలు తెలిపారు. మండల అధ్యక్షుడి ఒంటెద్దు పోకడ, నియంత్రణ లేకపోవడం బాధించిందని ఆయన పేర్కొన్నారు.