ముత్యపు అంజమ్మ దశదినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

3చూసినవారు
ముత్యపు అంజమ్మ దశదినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
ఎల్లారెడ్డికి చెందిన వ్యాపారి ముత్యపు వీరేశలింగం సతీమణి ముత్యపు అంజమ్మ ఇటీవల మృతి చెందారు. శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, కామారెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ దాఫేదార్ రాజు, మాజీ జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సాయిలు తదితరులు పాల్గొని అంజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్