ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తండ్రి శివరాజా గౌడ్ బుధవారం మరణించారు. ఈ వార్త అందిన వెంటనే ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా ఉన్నారు.