ఉత్తర శబరిమలలో స్పర్శ దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

1చూసినవారు
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభోత్సవ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం జరిగిన స్పర్శ దర్శనంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆలయాన్ని సందర్శించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రావిగౌడ్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, 212 మంది అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :