
తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందును లాక్కెళ్లిన చిరుత
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా మమల్దే గ్రామ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి పక్కన ఆరుబయట నిద్రిస్తున్న రెండు నెలల పసికందును చిరుతపులి లాక్కెళ్లింది. తెల్లవారుజామున చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలించగా, పొలాల్లో మాంసపు ముద్దలు కనిపించాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టగా, చిరుతపులి దాడి చేసిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.




