ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన చిత్రకారుడు బంగారు నంది, భారత విభూషణ్ ల అవార్డుల గ్రహిత చుక్క గోపాల్ గౌడ్ ను శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు అయినా జనార్దన్ గౌడ్, జాజాల సురేందర్ లు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో శాలువాతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తన చిత్రకళను ప్రదర్శించిన గోపాల్ గౌడ్ ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నేతలు పాల్గొన్నారు.