ఎల్లారెడ్డి చరిత్రలో ఏప్రిల్ 10 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. రూ. 200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించబడనున్న "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్" కు ఏప్రిల్ 10న సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధ్యక్షతన శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్, ఉప-సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటి నాయకులు, సీనియర్ నాయకులు, కోఆర్డినేషన్ సభ్యులు, బీసీ, ఎస్సీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు.