గుండె ఆపరేషన్‌కు నాలుగు యూనిట్ల రక్తదానం

1492చూసినవారు
హైదరాబాద్‌లోని కిమ్స్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ కోసం చికిత్స పొందుతున్న గంగారం (75)కు ఓ పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు‌ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎం. ఏ. వాజిద్ (ఏఆర్ కానిస్టేబుల్), చెన్నబోయిన ప్రసాద్, పబ్బ ఆర్యన్, పర్ష తృషాల్ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్)లు మానవతా దృక్పథంతో స్పందించారు. హైదరాబాద్‌కు వెళ్లి అవసరమైన నాలుగు యూనిట్ల రక్తాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవన్నారు.

సంబంధిత పోస్ట్