ఎల్లారెడ్డి డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్, కంటి వైద్య సహాయ అధికారి హరికిషన్ రావులు బుధవారం తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బోధన్, బాన్స్ వాడ లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి పరీక్షలు, మోతి బిందు నిర్ధారణ జరుగుతుంది.