సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన సమానత్వపు హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, దోపిడీని వ్యతిరేకించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్య, సాంస్కృతిక హక్కుల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసి మనోహర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.