గంజ్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గంజ్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని విక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.