కలెక్టర్ ని కలిసిన బాలికల వసతిగృహం విద్యార్థినిలు

1చూసినవారు
కలెక్టర్ ని కలిసిన బాలికల వసతిగృహం విద్యార్థినిలు
నూతన సంవత్సర సందర్భంగా కామారెడ్డి జిల్లా షెడ్యూల్ కులాల సమీకృత బాలికల వసతిగృహం విద్యార్థినులు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులు స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను కలెక్టర్ కు అందజేశారు. విద్యార్థినులు విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి పి. వెంకటేష్, వసతిగృహ అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్