గత అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి పాలన అంతం కోసం వెంకట రమణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని కామారెడ్డి మున్సిపల్ 34వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సుజిత భరత్ అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగిందని, ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జాలకు గురయ్యాయని, ఎమ్మెల్యే కాకముందు చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా భూ కబ్జాలపై 5 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇంకా దరఖాస్తులు రాని కబ్జాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.