ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, శ్రీ సాయినాథుని ఆలయ ప్రధాన ధర్మకర్త బీ. జనార్ధన్ గౌడ్ ఆదివారం నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట్ మేజర్ గ్రామపంచాయితీ నూతన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, అయ్యప్ప ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్ రూ. 11 లక్షల విలువైన స్టీల్ ను విరాళంగా అందించారు. ఆలయ కమిటీ తరఫున సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్ మాజీ ఎమ్మెల్యేను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.