నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కోటగిరి మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, కోటగిరి, పోతంగల్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, రామారావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.