కామారెడ్డి కలెక్టరేట్లో మంత్రి సీతక్క అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తే జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుందని, సివిల్ సప్లై వ్యవస్థలో లోపాలు లేకుండా పేదలకు నాణ్యమైన సరుకులు అందించాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండాకాలంలో వడదెబ్బ నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.