గిరిజన గురుకుల పాఠశాలకు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

వరద ముంపునకు గురైన కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం అందించింది. గతేడాది వచ్చిన భారీ వరదల కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ తీవ్రంగా నష్టపోయింది. ఈ సమస్యను ప్రిన్సిపల్ బి. అమర్ సింగ్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి గ్రీన్కో ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్లను అందించేలా చర్యలు తీసుకున్నారు. బుధవారం కంప్యూటర్లను కలెక్టరేట్లో అందించారు. ఈ సహాయం విద్యార్థుల చదువుకు ఆటంకం తొలగించనుంది.
