కామారెడ్డిలో జరిగిన అవగాహన సదస్సుకు హాజరైన హైకోర్టు జస్టిస్

3చూసినవారు
కామారెడ్డిలో జరిగిన అవగాహన సదస్సుకు హాజరైన హైకోర్టు జస్టిస్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ పి. సామ్ కోషీ, గ్రామ ప్రజలతో మమేకమై బాల్యవివాహాలు అరికట్టడం, చిన్నారులకు పోషకాహారం అందించడం, అవగాహన కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, సెల్ఫ్ అండ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. శనివారం కామారెడ్డి కళాభారతిలో మహిళలు, పిల్లల రక్షణ – సామాజిక బాధ్యత అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్