కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం హోలీ పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాజంపేట సర్పంచ్ శ్రీకాంత్, విడిసి అధ్యక్షులు సూర్యకాంతరెడ్డి, బిఎంఎస్ రాష్ట్ర నాయకులు సందు గారి రవీందర్ రెడ్డితో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. అందరూ కలిసి పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు.