ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం హోళీ పండుగను చిన్నారులు, పెద్దలు, యువకులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం రాత్రి 1వ వార్డు ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో పున్నమి హోళికా దహనంలో కాలనీ వాసులు, యువకులు పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి, పిడకలకు నిప్పంటించి హోళికాదహనం నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచే వయోబేధం లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. యువకులు, స్థానిక సీఐ రాజిరెడ్డి, ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది కూడా హోలీ ఆడారు.