ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, రామారెడ్డి మండలం ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల మధ్య ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన కమిటీ చైర్మెన్ చింతల శంకర్, కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తాను పుట్టి పెరిగిన నేలకు సేవ చేసే అదృష్టం తనకు లభించిందని, తన చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం జరగడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు, నూతన కమిటీ చైర్మెన్‌తో కలిసి ఎమ్మెల్యే కాలభైరవ స్వామికి అభిషేక పూజలు నిర్వహించారు.