అధికారంతో విర్రవీగితే ప్రజలే సమాధానం చెబుతారు: మాజీ ఎమ్మెల్యే

1చూసినవారు
శనివారం ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ, అధికారంతో విర్రవీగే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదని, అధికారం శాశ్వతం కాదని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి సభ్యత్వానికి విశేష స్పందన రావాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్