ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గణేష్ నిమజ్జన స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ జె. జగ్జీవన్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రత తదితర ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు.