జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ

2చూసినవారు
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మంగళవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఆయన హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్