8వ వార్డులో... పతికోసం సతీ ప్రచారం

4చూసినవారు
8వ వార్డులో... పతికోసం సతీ ప్రచారం
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఆసక్తికర రాజకీయ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నునుగొండ శ్రీనివాస్ తరఫున ఆయన భార్య, మాజీ వార్డు కౌన్సిలర్ నునుగొండ భూదేవి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ నేతలతో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ నుండి వస్తోంది. విశేషమేమిటంటే, పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నునుగొండ శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ ఇద్దరూ మంచి మిత్రులు కావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్