యాసంగిలో నారుమడిలో రాత్రి నీరు నిండుగా ఉంచి ఉదయాన్నే తీయాలి

2చూసినవారు
యాసంగిలో నారుమడిలో రాత్రి నీరు నిండుగా ఉంచి ఉదయాన్నే తీయాలి
యాసంగిలో నారుమడి యజమానులు రాత్రి వేళలో నీరు నిండుగా ఉంచి, తెల్లవారుజామున తీసివేసి కొత్త నీరు పెట్టాలని ఏవో సాయికిరణ్ సూచించారు. చలి సమస్యను అధిగమించడానికి నారుమళ్లపై ఇనుప చువ్వలు, వెదురు కర్రలతో ఊతం ఇచ్చి, పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా యూరియా బస్తలతో తయారుచేసిన పట్టాలతో సాయంత్రం వేళలో కప్పి ఉంచి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలన్నారు. మంచు కురుస్తున్నప్పుడు ఆకులపై బురద చల్లాలని, జింకు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్