8వ వార్డులో స్వాతంత్ర అభ్యర్థి సొంత నిధులతో అభివృద్ధి హామీ

1చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్ ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ వ్యాపారి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్, వార్డు ప్రజలకు పలు ఎన్నికల హామీలు ప్రకటించారు. ఆడపిల్ల పెళ్లికి రూ. 11,000, ఆడపిల్ల పుడితే రూ. 10,000, అంత్యక్రియల ఖర్చులకు రూ. 10,000, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య శిబిరం, ఇంటి నిర్మాణ అనుమతులు, మున్సిపాలిటీ సమస్యల తక్షణ పరిష్కారం, అలాగే గెలిచిన 15 రోజుల్లో 'బాడీ ఫ్రీజర్' కొనుగోలు చేస్తానని శ్రీధర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్