నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

0చూసినవారు
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను తక్షణమే మంజూరు చేయాలని మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అధికారి పి. డి. విజయ్ పాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆత్మకూరు, బొల్లారం, జలాల్పూర్, జాప్తి జాన్కం పల్లి గ్రామాల్లో అనేక మంది పేదలు ఇప్పటికీ గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారని, అర్హులైన పేద కుటుంబాలకు ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ గృహాలను నిర్మించేలా చూడాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్