ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

1చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణాలు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం ఆయన 7వ వార్డులో లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతి ఆధారంగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 164 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 120 ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్