ఇంకుడు గుంతల తొట్ల తయారీ యూనిట్ ప్రారంభం

3చూసినవారు
ఇంకుడు గుంతల తొట్ల తయారీ యూనిట్ ప్రారంభం
ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ లో మంగళవారం ఇంకుడు గుంతల తొట్ల తయారీ యూనిట్‌ను ఎంపీడీవో తాహేరా బేగం ప్రారంభించారు. మహిళా సంఘం సభ్యురాలు నిరుడి గంగమణి బాలకిషన్‌కు ఐకేపీ న్యూ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 2 లక్షల రుణం అందించి ఈ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. అన్ని గ్రామాల్లో ఇంటింటా మ్యాజిక్ సోక్ పిట్లను నిర్మించుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఈ తొట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్