కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

1చూసినవారు
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల పరిశీలన
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మంగళవారం పరిశీలించారు. స్టేషన్‌కు చేరుకున్న జీఎంకు రైల్వే అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో కొనసాగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆధునిక సాంకేతిక వసతులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎం తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్