కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం పట్టపగలే ఇద్దరు ఉద్యోగుల ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు 5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ. 50 వేల నగదును అపహరించుకెళ్లారు. దొంగల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.