ఎల్లారెడ్డి మండల సోమార్ పేట్ గ్రామ దుర్ఘటనలో గాయపడిన గంజి భారతికి యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బుధవారం, మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ ఆసుపత్రికి వెళ్లి భారతిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భారతి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. తన చికిత్సకు సహకరించిన కేటీఆర్, జాజాల సురేందర్ లకు భారతి కృతజ్ఞతలు తెలిపారు.