ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలం బెద్గం చెరువు తండాలో ఉన్నటువంటి శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడిని సోమవారం బీజేపీ రాష్ట్ర నాయకులు, జపాన్ శాస్త్ర వేత్త డాక్టర్. పైడి ఎల్లారెడ్డి సందర్శించారు. అలాగే వారు గ్రామ పెద్దల సమక్షంలో గుడి అభివృద్ధి కోసం 50, 000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంతోషించి ధన్యవాదాలు తెలిపారు.