రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల బస్సు పాస్ ల కాలపరిమితిని జూన్ 16 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి. ముకుంద రెడ్డి ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును జూన్ 16 వరకు పొడిగించినందున, బస్సు పాస్ ల గడువును కూడా పొడిగించాలని ఆర్టీసీ మేనేజ్మెంట్ ను కోరారు. దీంతో జూన్ 1 నుండి జూన్ 16 వరకు బస్ పాస్ లు పొడిగించే అవకాశం ఉంటుంది. డీపీఆర్ఓల ద్వారా ఈ నెల 31 సాయంత్రం వరకు బస్ పాస్ రినివల్ ప్రకటన వెలువడనుంది.