సమాజంలో 4వ పిల్లర్ అయిన జర్నలిస్టులు విలువలు కాపాడుకోవాలి

0చూసినవారు
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో 4వ స్తంభమైన జర్నలిస్టులు జర్నలిజం విలువలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పార్శీరాములు కల్యాణ మండపంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) తృతీయ మహాసభలు, జిల్లా కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగాయి. ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధులుగా నిలవాలని, సోషల్ మీడియా యుగంలో నిజానిజాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రజిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :