కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శనివారం అడూర్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 30న అడూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఆయన చర్చించి, సూచనలు చేశారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.