ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని గాంధారి మండలం జువ్వాడి గ్రామ
కాంగ్రెస్ నేతలు సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసి, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్యే వారికి శాలువా కప్పి సత్కరించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను త్వరలో చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన సూచించారు.