కళ్యాణివాగు ప్రాజెక్టు గేట్లు: విద్యుత్ మోటార్లు నిరుపయోగం, రైతుల ఆవేదన

1చూసినవారు
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలోని కళ్యాణివాగు ప్రాజెక్టులో విద్యుత్ సౌకర్యం లేక 7 రేడియల్ గేట్లకు అమర్చిన విద్యుత్ మోటార్లు ఏళ్లుగా నిరుపయోగంగా ఉండి తుప్పు పట్టాయని బుధవారం రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గేట్లను మ్యాన్యువల్‌గా ఎత్తాల్సి వస్తుండటంతో వరద సమయంలో ఆలస్యమవుతోందని, గతంలో గేట్లు కొట్టుకుపోవడం, మట్టి కట్ట తెగిపోవడం వంటి సంఘటనలకు ఇదే కారణమని వారు పేర్కొంటున్నారు. మోటార్లను మరమ్మతులు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్