మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క డి. అనసూయ పాల్గొని, గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తాగునీటి సరఫరా, సాగునీటి పరిస్థితి, సివిల్ సప్లై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వడదెబ్బ నివారణ చర్యలు, 99 సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.