జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ డివిజన్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా కిమ్యానాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నిజామాబాద్ ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఈఈగా పనిచేసిన ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో నిజాంసాగర్ డివిజన్ కు బదిలీ అయ్యారు. ఆయన రాకతో ఇక్కడ పనిచేసిన ఈఈ సోలమన్ నారాయణపేట్ కు బదిలీ అయ్యారు.