తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శనివారం హైదరాబాద్ లోని తమ నివాసంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నాయకులను, కార్యకర్తలను సన్నద్ధం కావాలని వారు దిశా నిర్దేశం చేశారు.