ఆత్మలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మెన్గా కుంట రాఘవరెడ్డి

0చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ పెద్ద ఆత్మకూర్ గ్రామ శివారులో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా భారత మిలిటరీ ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ కుంట రాఘవరెడ్డిని సోమవారం నియమించారు. ఆలయ నిర్మాణానికి మొదటి నుండి కృషి చేస్తున్న రాఘవరెడ్డి, తన పుట్టినరోజు నాడే ఈ పదవిని చేపట్టడం ఆనందంగా ఉందని, ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు, గ్రామస్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్