రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, హోంశాఖను ఒవైసీ సోదరులకు అప్పగించారని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో జరిగిన బీజేఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి వారి నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై గెలిచిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల హత్యాయత్నం దారుణమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.