న్యాయవాది పార్థివ దేహానికి నివాళులు అర్పించిన న్యాయవాదులు

506చూసినవారు
న్యాయవాది పార్థివ దేహానికి నివాళులు అర్పించిన న్యాయవాదులు
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది లోకయ్యగారి లక్ష్మయ్య (92) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో, ఎల్లారెడ్డి కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులకు హాజరు కావడం లేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ప్రకటించారు. న్యాయవాదులు చీనూర్ గ్రామానికి వెళ్లి లక్ష్మయ్య పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్