ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఆదివారం సదాశివనగర్ నుంచి 70 మంది బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవతో ప్రేరణ పొంది వారు కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.