కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం పిడుగుపాటు తీవ్ర కలకలం రేపింది. గాంధారి దుర్గం రోడ్డు సమీపంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. అదే సమయంలో మండలంలోని బొప్పాజీవాడ శివారులోని పత్తి చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న సూర్యకాంత్, శంకర్ వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయి కుప్పకూలారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఎడ్లబండిపై మెయిన్‌రోడ్డు వరకు తరలించి, అక్కడి నుండి అంబులెన్స్‌లో ఎక్కించారు.