తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య స్థానిక సంస్థలకు ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన ఉత్తర తెలంగాణా స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, అనవసర వ్యయాన్ని తగ్గించి, రాబడిని పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇతర అదనపు కలెక్టర్లు తమ జిల్లాల పనితీరును వివరించారు.