ఎల్లారెడ్డి నీలకంటేశ్వరాలయంలో శివస్వాముల మహాపడిపూజా

1చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శివ స్వాముల మాలధారణ చేసిన స్వాములు ఆదివారం రాత్రి శ్రీ నీలకంటేశ్వరాలయంలో శివుని మహాపడిపూజను ఆలయ పూజారి సంగప్ప పర్యవేక్షణలో నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ పూజలో శివలింగానికి 11 అభిషేకాలు చేశారు. రాత్రి 11.30 గంటలకు 12 మెట్లపై కర్పూరం వెలిగించి, హారతులు ఇచ్చారు. ఆలయ ఆవరణంలో శివపడిని వేసి పూజలు చేశారు. బోధన్ నుండి వచ్చిన భజన బృందం భక్తి గానామృతంతో భక్తులను ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుండి శివమాల ధరించిన స్వాములు ఈ పూజకు హాజరయ్యారు. పూజ అనంతరం స్వాములకు, భక్తులకు అల్పాహారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్